ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు..

02-05-2024 12:05:00 AM

జెట్ ఇంధనంపై ధర పెంపు

న్యూఢిల్లీ, మే 1: సార్వత్రిక ఎన్నికల వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించాయి. అయితే జెట్ ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫుయెల్) ధరను మాత్రం పెంచాయి. జెట్ ఇంధనం ధరను రూ.749.25 మేర పెంచగా, కిలో లీటరు ధర రూ.1,01,642 కు పెరిగింది. కోల్‌కత్తాలో జెట్ ఇంధనం ధర రూ.1,10,583, ముంబైలో రూ.95,173,  చెన్నైలో రూ.1,09,898కు పెరిగింది. ఇక, 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను కంపెనీలు రూ.19 మేర తగ్గించాయి. దీంతో దేశ రాజధానిలో సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,745కి అందుబాటులోకి వచ్చింది. ముంబైలో సిలిండర్ ధర రూ.1,698 కాగా, చెన్నైలో రూ.1,911, పశ్చిమబెంగాల్‌లో రూ.1,859కు తగ్గింది. జెట్ ఇంధన ధర పెరగడంతో విమాన టికెట్ల ధర కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.