16 April, 2026 | 8:15 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఎస్ ఎన్ డిపి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

15-12-2025 10:21 PM

పీర్జాదిగూడ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి..

మేడిపల్లి (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ సర్కిల్‌లో కొనసాగుతున్న స్ట్రాటజిక్ నాలా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పనులను పీర్జాదిగూడ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన హెచ్ఎం డబ్ల్యూ ఎస్ అధికారులతో పాటు, ఎస్ ఎన్ డి పి కాంట్రాక్టర్లు, రోడ్డు కాంట్రాక్టర్లకు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యంగా తాగునీటి పైప్‌లైన్ల పనుల్లో ఎలాంటి లీకేజీలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుని పనులు పూర్తి చేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాణ్యతతో కూడిన పనులు చేపట్టి, నిర్ణీత కాలవ్యవధిలో అన్ని పనులు పూర్తిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ స్వామి ఆలయ డైరెక్టర్ వంగూరి పరమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.