16 April, 2026 | 10:10 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మాజీ మంత్రి హరీష్ రావును సన్మానించిన సర్పంచ్ సంతోష్ యాదవ్

15-12-2025 10:23 PM

మర్రిగూడ (విజయక్రాంతి): మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ సోమవారం మర్రిగూడ మండల కేంద్రంలో ఘనంగా సన్మానించారు. నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచులను హరీష్ రావు శాలువాతో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని నూతన సర్పంచులకు, వార్డు సభ్యులకు, నాయకులకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, సర్పంచులు రొక్కం భాస్కర్ రెడ్డి, కమ్మ చిచ్చు వెంకటేష్, ఆంబోతు తులసీరామ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.