4 July, 2026 | 11:10 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

విడాకులకు గురక కూడా కారణమే..!

20-05-2024 12:00 AM

ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లు కావొచ్చు.. శారీరక శ్రమ లేదా మానసిక ఒత్తిడి కావొచ్చు.. ఇవన్నీ మన నిద్ర మీద ప్రభావం చూపిస్తాయని తెలుసు! కానీ ఇన్ని సమస్యల మధ్య నిద్రపోతే గురక రావడం అనేది సహజమే అంటున్నారు వైద్యులు. విచిత్రం ఏంటంటే గురక వల్ల విడాకుల వరకు వెళ్తున్నారని కొన్ని సర్వేలు వెల్లడించాయి. అంతెందుకు రీసెంట్‌గా రిలీజ్ అయిన తమిళ్ ‘గుడ్ నైట్’ సినిమా కూడా గురక మీదే తీశారంటే అర్థం చేసుకోవచ్చు... దీని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో? డివోర్స్‌కు గురక కూడా ఒక కారణం అవుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అదెంటో ఇప్పుడు చూద్దాం..

విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. దీనితో చాలా మానసిక, సామాజిక అంశాలు ముడిపడి ఉంటాయి. దంపతులకు పిల్లలుంటే పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. కాబట్టి విడాకులను కేవలం కాగితం ముక్కలా చూడకూడదు. భరణం, పిల్లల సంరక్షణలాంటి అనేక అంశాలతో ఇవి ముడిపడి ఉంటాయి. పిల్లలపై విడాకుల ప్రభావం అనేది చాలా పెద్ద సామాజిక సమస్యగా పడుతుందని మానసిక నిపుణుల  అభిప్రాయం.

వయస్సు పెరుగుతున్నకొద్దీ ఈ సమస్య మరింత తీవ్రతరమవుతుంది. అయితే ఈ మధ్య గురక కారణంగా ఓ జంట విడాకులు తీసుకునే స్థాయికి చేరుకుంది. ఇటీవల అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సంచలన రిపోర్ట్‌ను బయటపెట్టింది. కేవలం గురక కారణంగా అమెరికాలో జంటలు ఒకరి నుంచి ఒకరు విడాకులు తీసుకుంటున్నారని, విడాకులకు గురక అనేది మూడవ అతిపెద్ద కారణంగా తేల్చి చెప్పారు. భారత్‌లోనూ గురక సమస్య పెరుగుతోంది. దేశంలో దాదాపు 20 శాతం మంది నిద్రిస్తున్నప్పుడు గురక పెడుతున్నారు.

భారతదేశంలో విడాకులకు ఇది ఒక కారణం కానప్పటికీ, ఇది ఖచ్చితంగా భార్యభర్తల మధ్య సంబంధాలలో మనస్పర్థలకు దారితీస్తోంది. గురక సమస్య ఎవరికైనా వస్తుందని డాక్టర్లు అంటున్నారు. గాఢ నిద్రలో నోటిలోని నాలుక, గొంతు కండరాలు సడలించడం మొదలైనప్పుడు గురక వస్తుంది. కొంత మందిలో గొంతు కణజాలం శ్వాస కోశానికి ఆటంకం కలిగిస్తుంది. దీని కారణంగా ముక్కునోరు కంపించడం ప్రారంభమవుతుంది. దీంతో ఈ ధ్వని గురక రూపంలో బయటకు వస్తుంది. 

నిర్లక్ష్యం చేయకూడదు

గురకకు అనేక కారణాలున్నాయి. వీటిలో ప్రముఖమైనది స్లీప్ అప్నియా సమస్య, స్లీప్ అప్నియా అనేది నిద్ర సంబంధిత రుగ్మత. ఇది కాకుండా గురకకు మరో ప్రధాన కారణం సైనస్. గురక సమస్యను సాధారణ సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని డాక్టర్లు అంటున్నారు. ఇది చికిత్స అవసరమయ్యే ఆరోగ్య పరిస్థితి. జీవన శైలిలో కొన్ని మార్పుల ద్వారా దీని చికిత్స సులభంగా చేయవచ్చు. అయితే దీనికి ముందు గురక సమస్యను ఒక వ్యాధిగా పరిగణించి చికిత్స పొందడం ముఖ్యం. డాక్టర్లు మెడికల్ హిస్టరీని అడిగి కొన్ని పరీక్షలు చేస్తారు.

దీని ద్వారా మీ శ్వాసకోశం ఎందుకు అడ్డుపడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయబడుతుంది. రినైటిస్ లేదా సైన సైటిస్, వాపు టాన్సిల్స్ వంటి ఏదైనా సమస్య ఉందా అని డాక్టర్ పరీక్షిస్తారు. ముఖ్యంగా ధూమపానం మానేయడం లేదా ఆల్కహాల్ తాగడం మానేయని డాక్టర్ మీకు సలహా ఇస్తారు. గొంతు నుంచి కొన్ని కణజాలాలను తగ్గించడం ద్వారా గురక సమస్య తగ్గుతుంది.