4 July, 2026 | 9:51 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

క్యాన్సర్‌ను గుర్తించాలంటే..?

20-05-2024 12:00 AM

మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు జీవితాన్నే తలకిందులు చేస్తాయి. వాటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలి. లేదంటే చాపకింద నీరులా  మనల్ని హరించుకుపోతాయి. ఇది నిజం. మీ వయసు 50 దాటితే కచ్చితంగా కొన్ని పరీక్షలు చేయించుకోవాలి. “నేను బాగానే ఉన్నాను.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను.. ధూమపానం.. మద్యపానం వంటి అలవాట్లు లేవు.. ఆరోగ్యపరంగా ఎలాంటి నొప్పి, బాధ, ఇబ్బంది లేదు” అనుకుంటే పొరపాటు.

మన అలవాట్లతో సంబంధం లేకుండా వయసుతో పాటు వచ్చే కొన్ని రోగాలు రిస్క్ ఫ్యాక్టర్‌గా మారతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా వయసుతో పాటు వచ్చే వ్యాధుల్లో ‘కోలొరెక్టల్ క్యాన్సర్’ (పురీషనాళం) ఒకటి. ముందుగానే ఈ క్యాన్సర్ లక్షణాలు గుర్తిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ క్యాన్సర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..!

శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుందనే సంగతి తెలిసిం దే. అయితే, శరీరంలో ఎక్కడైనా కణజాలం  విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడతూ, చనిపోతూ ఉంటుంది. శరీరంలో ఈ ప్రక్రియకు విఘా తం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడు తుంది. డీఎన్‌ఏ వల్ల మన తల్లిదండ్రుల్లో ఉండే లక్షణాలే మనకు కూడా వస్తాయనే విషయం తెలిసిందే.

అలాగే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అంతేగాక ఆహారపు అలవాట్లు, రేడియేషన్, స్మోకింగ్, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. దీని వల్ల కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. ఫలితంగా శరీరానికి అవసరమైన కణాల కన్నా ఎక్కువగా వృద్ధి చెందుతాయి. అవన్నీ కలిసి ట్యూమర్(కణితి)గా ఏర్పడతాయి. దీన్నే క్యాన్సర్ అంటారు. 

కోలన్ క్యాన్సర్ అంటే..? 

మన జీర్ణ వ్యవస్థలో చివరగా ఉండే భాగాన్ని కోలన్ అనీ, ఈ భాగానికి వచ్చే క్యాన్సర్‌ను కోలన్ క్యాన్సర్ అని అంటారు. ఆహారంలోని పోషక పదార్థాలను చిన్నపేగులు గ్రహిస్తే, నీటిని పొటాషియం, కొవ్వులో కరిగే విటమిన్‌లను పెద్దపేగు గ్రహించి వ్యర్థపదార్థాలను బయటికి పంపిస్తుంది. పెద్దపేగు చతురస్రాకారంలో ఉం టుంది. దీనిని నాలుగు భాగాలుగా విభజించారు.

వాటిలో చివర ఉండేదే మలద్వారం. పెద్దపేగు చివరి భాగంలో పాలిప్స్ (కణుతు లు) ఏర్పడి, వాటిలో కణాలు అపరిమితం గా పెరగడం వల్ల ఈ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఈ కణితులు కొంతకాలం ఏమీ చేయకుండా అలాగే ఉన్నా క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంది. కాబట్టి కొలనోస్కోపీలో వీటిని గమనిస్తే తీసివేయించుకోవడం మం చిది. మిగతా క్యాన్సర్‌లలాగే ఈ క్యాన్సర్‌కు కూడా కచ్చితమైన కారణాలు తెలియకపోయినా జన్యుపరివర్తనం, లావుగా ఉన్న వారిలో, మాంసం ఎక్కువగా తీసుకునే వారి లో, ఫైబర్ తక్కువగా తీసుకునేవారిలో, ఆల్కహాల్, స్మోకింగ్ అలవాట్లు, ఇతర క్యాన్సర్లకు తీసుకునే రేడియేషన్.. వంటివి కొంతవరకు కారణం కావొచ్చు. 

క్యాన్సర్ లక్షణాలు.. 

పెద్దపేగు క్యాన్సర్ (కోలోరెక్టల్ క్యాన్సర్) వచ్చినప్పుడు తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ అది పెరిగినప్పుడు శరీరంలో అనేక లక్షణాలు కనిపించడం ప్రారంభం అవుతాయి. మొదట్లో డాక్టర్ దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకుంటే తప్పించుకోవచ్చు. శరీ రంలో కనిపించే పేగు క్యాన్సర్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. 

* మలంలో రక్తం: ఇది కూడా పేగు క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణం. కొన్నిసార్లు దీన్ని పైల్స్‌తో బాధపడుతున్నట్లు భావిస్తారు. శరీరంలో ఇలాంటి సమస్య వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మలంలో రక్తం పేగు క్యాన్సర్‌కు సంబంధించినది కావొచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేసుకుంటే సరిపోతుంది.  

* కడుపు నొప్పి: చెడు జీవనశైలి, సరైన ఆహారం తీసుకోవడంతో జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పొత్తికడుపు నొప్పి అనేది ఒక సాధారణ సమస్య. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తరచుగా కడుపు నొప్పి ఉన్న వ్యక్తులు వారు పెద్ద పేగు క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే చికిత్స ప్రారం భించాలి. లేదంటే ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

* జీర్ణక్రియలో సమస్య: మలబద్దకం లేదా జీర్ణక్రియకు సంబంధించిన ఇతర సమస్యలు ఉంటే దానికి చికిత్స చేయడం  అవసరం. జీర్ణక్రియ సరిగా జరగకపోవడం వల్ల పొట్టలో భారం, ఎసిడిటీ వంటి సమస్యలు తరచూ వేధిస్తాయి. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు సరైన ఆహారం తీసుకుంటూ వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.  

చికిత్స ఏంటి?

50 ఏళ్ళు పైబడినవారు ఒకసారి మలపరీక్ష (యఫ్.ఒ.బి.టి), డాక్టర్ సలహా మేరకు సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలి అలవర్చుకుంటే కొంతవరకు క్యాన్సర్‌ను దూరంగా ఉంచవచ్చు. మలంలో రక్తం పడటం పైల్స్ వంటి సమస్యల్లో కూడా సాధారణమే అయినా, ఎప్పుడూ ఆ సమస్యే అనే భావించకుండా ఒక్కసారి రెక్టమ్‌ను పరీక్ష చేసే సిగ్మాయిడోస్కోపీ లేక వీటితో పాటు పెద్ద పేగును మొత్తంగా చూసే కొలనోస్కోపీ, ఇంకా డాక్టర్ సలహా మేరకు ఇతర పరీక్షలు చేయించుకుంటే మంచిది.

అంతేగాని వేడిచేసింది అనీ, లేదా ఫైల్స్ వంటి సమస్య అయి ఉండవచ్చులే అనీ ఎవరికి వారు సొంత వైద్యం చేసుకుంటే.. ఉన్న సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించినట్లయితే, ముఖ్యంగా ఎడమవైపు కోలన్ క్యాన్సర్‌లో కీమోథెరపీ, రేడియేషన్ ముందుగా ఇచ్చి, తరువాత సర్జరీ చేస్తారు. క్యాన్సర్‌ను చివరి దశలో గుర్తించినా మోనోక్లోనల్ వంటి మందుల ద్వారా రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. 

క్యాన్సర్ వంశపారంపర్యంగా వస్తుందా? 

చాలా కేసుల్లో పెద్ద పేగు క్యాన్సర్ వంశపారపర్యంగా రావడం లేదు. కానీ, ఎవరైనా మీ సన్నిహిత బంధువుల్లో 50 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ క్యాన్సర్‌కు గురైతే ఆ విషయం మీరు డాక్టర్‌కి చెప్పాలి. లించ్ సిండ్రోమ్ వంటి కొన్ని జెనటిక్ కండీషన్లలో పేగు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని తగ్గించవచ్చు. ఈ క్యాన్సర్ ఏ దశలో ఉందో ముందస్తుగా డాక్టర్లు తెలుసుకోగలిగే.. ఈ క్యాన్సర్‌ని నయం చేయొచ్చు. ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా సగానికి పైగా పేగు క్యాన్సర్లను తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. 

ఈ పరీక్షలు తప్పనిసరి

మనం తీసుకునే ఆహారాన్ని బట్టి అజీర్తి, విరేచనాలు అవుతూ ఉండటం.. అప్పుడప్పుడు జరిగేదే కానీ, అకస్మాత్తుగా మన జీర్ణ వ్యవస్థలో మార్పులు కనిపించి, ఏమి చేసినా తగ్గకపోగా, ఇంకా ఎక్కువవుతున్నట్లు గమనిస్తే తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఈ క్యాన్సర్‌ను నిర్ధారించడానికి డాక్టర్లు ముందుగా ఫ్యామిలీ హిస్టరీ, ప్రత్యక్షంగా చూడటం వంటివి చేశాక కొల నోస్కోపీ, బేరియమ్ ఎనీమా ఎక్స్‌రే చేస్తారు. కొలనోస్కోపి అంటే ఒక సన్నని గొట్టాన్ని మలద్వారంలో పెట్టి కెమెరా సహాయంతో పాలిప్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తారు.

కణితులు ఏమైనా కనబడితే తొలగించి బయాప్సీ పరీక్షలకు పంపుతారు. మైక్రోస్కోప్ సహాయంతో ఆ కణాలు క్యాన్సర్ కణాలా? అని తేల్చుకుంటారు. బేరియమ్ మింగించి పెద్ద పేగుకు చేరుకున్నాక ఎక్స్‌రే తీసి చూస్తారు. కణుతులు ఉంటే ఈ ఎక్స్‌రేలో ఆ ప్రదేశం నల్లగా కనిపిస్తుంది. బయాప్సీలో క్యాన్సర్ కణాలు అని తేలితే స్టేజ్ తెలుసుకోవడానికి మిగతా పరీక్షలు చేస్తారు. ఛాతి ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీస్కాన్, సీఈఏ అవసరమైతే పెట్ సీటీస్కాన్ పరీక్షలు చేయడం ద్వారా క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉన్నది అనే నిర్ధారణకు రావచ్చు. 

* ప్రాథమిక దశలో పేగు క్యాన్సర్‌ను గుర్తిస్తే నయం చేయవచ్చు. ఒక్కో వ్యక్తిని బట్టి దీనికి చికిత్సలు ఉన్నాయి. జెనెటిక్ పరీక్షలు చేయడానికి కూడా ఇప్పుడు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నాయి. ఏ దశలో క్యాన్సర్ ఉందో గుర్తిస్తే, దానికి తగ్గ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీలో ఏదో ఒకటి కానీ, అవసరాన్ని బట్టి కలిపి కానీ చికిత్స చేస్తారు. మంచి జీవన శైలిని అంటే ఎక్కువగా ఎక్సర్‌సైజు చేయడం, ఎక్కువ ఫైబర్ ఉన్నవి తింటూ, కొవ్వు తక్కువ ఉండేవి తినాలి.

రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగుతూ ఉండాలి. మన దేశం నుంచి ఇంగ్లండ్, అమెరికా దేశాలకు వెళ్లేవారిలో ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తున్నది. కోలన్ చివరి భాగం మలద్వారానికి కొంచెం పైన రెక్టయేకు సంబంధించిన కొలోరెక్టల్ క్యాన్సర్ మన దేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ కనిపించే ఈ క్యాన్సర్ 50 ఏళ్లు, ఆ పైబడిన వారికి మరీ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది. 

 డాక్టర్ రవిచందర్ వెలిగేటి

చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికోవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, హైదరాబాద్,  040 68334455