5 July, 2026 | 12:48 AM

బరువు తగ్గడానికి..!

20-05-2024 12:00 AM

సన్నగా, నాజూకైన శరీరం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయానికి, బరువుకు అనేక కారణాలు ఉంటాయి. థైరాయిడ్, జన్యుపరమైనా లోపాలు, నిద్రలేమి ఊబకాయ సమస్యకు కారణాలుగా వైద్యులు చెప్తున్నారు. ఊబకాయం నుంచి బయటపడి నాజూకైన శరీరం కోసం చేయాల్సిందేంటంటే మొదట తినే తిండి విషయంలో జాగ్రత్త వహించాలి. సమయంతో సంబంధం లేకుండా చిరుతిండ్లు తినడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు చెప్తున్నారు. ఈ మధ్య బయట తయారు చేసే ఆహారాలలో ఎక్కువ శాతం కల్తీవే ఉంటున్నాయి. దీంతో సన్నగా ఉన్నవారు కూడా ఉన్నట్టుండి లావయ్యేందుకు ఇవి కూడా కారణమవుతున్నాయి. అయితే బరువు తగ్గాలంటే ఎటువంటి ఆహారం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం...

* బ్రేక్ ఫాస్ట్‌గా మొలకెత్తిన విత్తనాలు తినడం, రాగి జావ తాగడం ఉత్తమం. లేదు కాదంటే టిఫిన్ చేయాలనుకుంటే నాలుగు ఇడ్లీలతో లేదా రెండు దోసెలు టమాటా చట్నీతో తీసుకోవడం మంచిది.. మర్చి పోకుండా బయట ఆహారం కాకుండా ఇంట్లో చేసినవే తినాలి.

* బ్రేక్ ఫాస్ట్‌కు లంచ్‌కి మధ్యలో ఏదైనా జ్యూస్ తీసుకోవాలి. క్యాలరీలు తక్కువగా ఉండే జ్యూస్ తాగడం మంచిది. జ్యూస్‌లు తాగే  వీలులేని వారు నిమ్మకాయ రసం తాగవచ్చు.

* లంచ్‌లో రైస్‌కు తగ్గ కూర తీసుకోవాలి. ఆకు కూరలు వారానికి కనీసం మూడు సార్లు తింటే మంచిది.

* నల్లబెల్లంతో చేసిన పల్లీల పట్టి లేదా జీడిపప్పు పట్టి సాయంత్రం వేళ స్నాక్స్‌గా తీసుకోవచ్చు. నల్లబెల్లం వంటకాలు తినడం వల్ల శరీరంలో ఐరన్ పెరుగుతుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు.