29 March, 2026 | 3:37 AM

సీబీసీఐడీ విచారణ

29-03-2026 01:54 AM

రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సహా.. అక్రమ మైనింగ్‌పై 

  1.   2014 నుంచి ఇప్పటివరకు విచారణ చేయిస్తాం
  2. బీఆర్‌ఎస్ హయాంలో మైనింగ్, ఇసుక దోపిడీ జరిగింది 
  3. హరీష్‌రావు, కేటీఆర్ అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు 
  4. బీఆర్‌ఎస్ బ్లాక్‌మెయిల్, బెదిరింపులకు భయపడేది లేదు 
  5. మీ పైరవీలకు మంత్రి పొంగులేటి లొంగనందుకా?
  6. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి  

హైదరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): అక్రమ మైనింగ్‌పై  రాష్ట్ర ప్రభు త్వం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 2014 జూన్ 2 నుంచి ఇప్పటీ వరకు జరిగిన అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.  రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు చెందిన గాయత్రి గ్రానైట్,  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చెందిన స్వేతా గ్రానైట్, ఏపీ మాజీ ఎమ్మెల్యేకు సం బంధించి శిరీషజియే గ్రానైట్, మిడ్విస్ట్ గ్రా నైట్‌తో పాటు సిరిసిల్ల ఇసుక మాఫియాపై కూడా విచారణ చేయిస్తామని సీఎం వెల్లడించారు. 

అదే విధంగా సం తోశ్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావు, హరీష్‌రావు సోదరుడు మహేష్‌రావు ఇసుక అక్ర మాలపైన విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై పద్దుల సంద ర్భంగా మైనింగ్, ఇసుక అక్రమాలపై వాడివేడిగా చర్చ జరిగింది.  మం త్రి పొంగు లేటి శ్రీనివాస్‌రెడ్డి కుటుంబానికి చెందిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీ మై నింగ్ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతుందని, అందుకు  హౌజ్ కమి టీ వేసి విచారణ జరిపించాలని  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలో సభలో మాట్లా డిన సీఎం రేవంత్ రెడ్డి.. రాఘవ కన్‌స్ట్రక్షన్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు గంగుల, వద్దిరాజు మైనింగ్‌లపై, జూన్ 2 నుంచి ఇప్పటివరకు ఇచ్చిన మైనింగ్ లీజులపై విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.  విచారణ నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశంలో సభముందు ఉంచుతామన్నారు. అక్రమ మైనింగ్‌కు హరీష్‌రావు , కేటీఆర్ నాయకత్వం వహించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ నేతల బ్లాక్‌మెయిలింగ్‌కు భయపడేదిలేదని పేర్కొన్నారు. 

బీఆర్‌ఎస్ హయాంలోనే..

బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలోనే ఇసుక, మై నింగ్ దోపిడి జరిగిందని, వేల కోట్ల రూపాయలను కొల్లగొట్టారని సీఎం మండిప డ్డారు. మైనింగ్ శాఖ తొలుత హరీశ్ రావు వద్ద ఉండేదని ఆయన అడ్డగోలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఈ విషయంలో కొడుకు, అల్లుడి‘ మధ్య పంచాయతీ పడితే దీనికి పరిష్కారంగా కేసీఆర్ ఆ శాఖను అల్లుడి వద్ద నుంచి తీసేసి కొడుకు కేటీఆర్‌కు  అప్పగించారని సీఎం తెలిపారు. వారి దోపిడీని నిలువరించి మైనింగ్, ఇసుకలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచామన్నారు. బీఆర్‌ఎస్ నేతలు తమకు లొంగని మంత్రులపై ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

నేరెళ్ల ఇసుక రవాణా, అలాగే 169 జీవో ద్వారా   ఏపీకి చెందిన ఒక మాజీ ఎమ్మెల్యే ను .. బీఆర్‌స్‌కు చెందిన ఎమ్మెల్యే, మాజీ మంత్రి బెదిరించి శీరిషజీయో గ్రానైట్‌ను అక్రమంగా రాయించుకునేన విషయం కూడా బయటికి వస్తుందని హెచ్చరించారు. ఈ సంస్థల అక్రమ మైనింగ్‌ను ఈడీ, విజిలెన్స్ విభాగాలు ఇప్పటికే గుర్తించాయన్నా రు. రాష్ట్ర ఖజానాకు గండికొట్టే ఏ చిన్న తప్పిద మైనా ప్రభుత్వం ఊపేక్షించబోదని హెచ్చ రించారు. 

రాఘవ కన్‌స్ట్రక్షన్‌కు ప్రభుత్వమే నోటీసులు ఇచ్చి మైనింగ్ శాఖ ద్వారా జరిమానాలు వసూలుచేసిందన్నారు. తెలంగా ణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని ఆరోపిస్తున్న బీఆర్‌ఎస్.. ఇసుక ఆదాయం పెరిగిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాఇకి  2024-4 లో రూ. 721 కోట్లు, 25-26లో రూ. 972 కోట్ల ఆదాయం వచ్చిందని, ఒక ఏడాదిలో 35 శాతం ఆదాయం పెరిగిందని వివరించారు. రియల్‌ఎస్టేట్  పడిపోతే ఇసుక అమ్మ కాలు ఎలా  పెరుగుతాయని ప్రశ్నించారు. 

సొంత చెల్లినే బయటికి పంపించాడు.. 

 కేటీఆర్ ఆస్తి తగాదాల వల్ల తన సొంత చెల్లి కవితను ఇంట్లో నుంచి, పార్టీ నుంచి బయటకు పంపించారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. మంత్రి పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి బంధువులకు వ్యాపారాలు ఉంటే పొంగులేటికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. పొంగులేటిని బెదిరించి లొంగదీ సుకోవాలనే ప్రయత్నం దిక్కుమాలిన చర్య అన్నారు.  బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న సిఫారసులను, పైరవీలను మంత్రి ప్రోత్సహించలేదనే కక్షతో ఆయనపై బుదరజల్లు తున్నారని విమర్శించారు.

మంత్రులను బ్లాక్ మెయిల్ చేద్దామనుకుంటే ఇలాంటి పప్పులు ఉడకవన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడే క్రమంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అక్రమ మైనింగగ్ దోషులు ఎంతటివారైన శిక్ష అనుభవించాల్సిందేనని సీఎం తేల్చి చెప్పారు. ఇవన్ని సీబీ సీఐడీ విచారణ ద్వారా నిజాలు బయటకు తీసి ఒక్కొక్కరి సంగతి తేలుస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు.