calender_icon.png 15 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచానా ఎత్తేసిన కమీషన్ ఏజెంట్

01-12-2024 01:40:02 AM

పసుపు రైతులకు రూ.10 కోట్లకు పైగా టోకరా

ఖాతా బుక్కులతో పరార్

నిజామాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్దానంద్ గంజ్‌లో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఒక కమీషన్ ఏజెంట్ రైతులకు చెల్లించాల్సిన రూ.10 కోట్లకు పైగా చెల్లించకుండా పరారయ్యాయడు. పసుపు వ్యాపారానికి పెట్టింది పేరుగా నిజామాబాద్ మార్కెట్ కొనసాగుతోంది. నిజామాబాద్ మోర్తాడ్, కమ్మర్‌పల్లి పుసుపు రైతులందరూ ఈ కమీషన్ ఏజెంట్ వద్దకు తమ పంటను తెచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా గంజ్‌లో వ్యాపారం చేస్తున్న సదరు వ్యాపారి ఉడాయించడం రైతులు నమ్మలేకపోతున్నారు. దాదాపు రూ.పదికోట్లకు పైగా పంట తాలుకు డబ్బులు రైతులకు చెల్లించేది ఉన్నట్టు వ్యాపార వర్గాల నుంచి తెలుస్తోంది. ఖాతా బుకుక్కలతో సహా పరారు కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు.