15 August, 2026 | 3:42 AM

ఈ నెల 16న సామాజిక న్యాయ వేదిక జిల్లా కమిటీ సమావేశం

15-08-2026 12:44 AM

భూపాలపల్లి టౌన్ ఆగస్టు 14 (విజయ క్రాంతి) : ఈ నెల 16 న సామాజిక న్యాయ వేదిక జిల్లా కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు సామాజిక న్యాయ వేదిక జిల్లా కన్వీనర్ ఆకుల సుభాష్ ముదిరాజ్  అధికార ప్రతినిధి దామెరుప్పులమధు స్వామిలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు భూపాలపల్లి జిల్లా లో 85 శాతం దళిత బహుజన జనాభా ఉన్నప్పటికీ   దళిత బహుజన వర్గాలకు పదవులు అందని ద్రాక్ష గా మారాయని  దళిత బహుజన వర్గాల ఐక్యత అధికారం కోసం సామాజిక న్యాయ వేదిక పనిచేస్తోందని  దీని కోసం పూర్తి స్థాయిలో పని చేయాలని ఆసక్తి కలిగిన దళిత బహుజన కుల సంఘాల ప్రతినిధులు హాజరై   తమ అమూల్యమైన సలహాలు అందించాలని సామాజిక న్యాయ వేదిక  భూపాల పల్లి జిల్లా కన్వీనర్ ఆకుల సుభాష్ ముదిరాజ్ అధికార ప్రతినిధి దామెరుప్పులమధు స్వామి లుపిలుపునిచ్చారు.