calender_icon.png 15 February, 2026 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైర్మన్ ఎన్నికల్లో సామాజిక న్యాయం

15-02-2026 12:00:00 AM

  1. జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు అవకాశం కల్పించాలి
  2. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో అన్ని పార్టీలు సామాజిక న్యాయం పాటించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడు తూ కౌన్సిలర్లు బీసీలు అయితే.. చైర్మన్ లుగా అగ్రకులాలకు అవకాశం కల్పిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. జనరల్ స్థానాలు అంటే రెడ్డి, రావులకు రిజర్వేషన్ కాదు అని, జనరల్ స్థానాల్లో కూడా మున్సిపల్ చైర్మన్లుగా బీసీలకు అవకాశం కల్పిం చాలన్నారు.

జనరల్ స్థానాల్లో బీసీలు అత్యధిక సంఖ్యలో గెలవడం బీసీ ల ఐక్యతకు నిదర్శనం అని జాజుల పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 60 శాతం బీసీలే గెలిచారు.. చైర్మన్లుగా, మేయర్‌గా 60 శాతం బీసీలకు అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ 60, బీఆర్‌ఎస్ 10 చైర్మన్ స్థానాలు బీసీలకు కట్టబెట్టాలని జాజుల డిమాండ్ చేశారు.  ఎవరి వాటా వాళ్ల కు దక్కాలన్న రాహుల్ గాంధీ సూత్రాన్ని కాంగ్రెస్ అమలు చేయాలన్నారు. అగ్రకుల ఎమ్మెల్యేలు ప్రాతిని ధ్యం వహిస్తున్న నియోజకవర్గం తమ సొంత కులనేతలకు చైర్మన్లు అవకాశం కల్పించాలని చూస్తే సహించమన్నారు.