15 April, 2026 | 12:39 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నుమాయిష్.. తెలంగాణ కీర్తి కిరీటం

15-02-2026 12:00 AM
  1. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 
  2. అట్టహాసంగా ముగిసిన 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 
  3. సొసైటీ విద్యాసంస్థల విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం 

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నాంపల్లిలో జరిగే నుమాయిష్ కేవ లం ఒక ప్రదర్శన మాత్రమే కాదని, ఇది తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా మారిందని మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి కొనియాడారు.  హైదరాబాద్ సంస్కృతిలో భాగమై, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాంపల్లి నుమాయిష్ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 85వ ఎడిషన్ శనివారం అట్టహాసంగా ముగిసింది.

సుదీర్ఘ కాలం పాటు నగరవాసులను అలరించిన ఈ ప్రదర్శన ముగింపు వేడుకలకు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, స్టాల్స్ నిర్వాహకులకు, మీడియా ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లా డారు. దేశంలో మరే రాష్ర్టంలోనూ జరగని విధం గా, అత్యంత భారీ స్థాయిలో జరిగే ఏకైక ఎగ్జిబిషన్ మన హైదరాబాద్ సొంతమని గర్వంగా చెప్పారు. 

ఈ ప్రదర్శన ద్వారా నిరుపేదలకు, చిరు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందని అభిప్రాయప డ్డారు. నుమాయిష్ సొసైటీ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను మండలి చైర్మన్ ప్రత్యే కంగా అభినందించారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని  పేద ఆడపిల్లల విద్యాభివృద్ధికి, విద్యాసంస్థల నిర్వహణకు ఖర్చు చేయడం గొప్ప విషయమన్నారు.  ముగింపు వేడుకల్లో భాగంగా నుమాయిష్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థల్లో అత్యంత ప్రతి భ కనబరిచిన విద్యార్థులకు గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా గోల్డ్ మెడల్స్ అందజేశారు.

అలాగే ఎగ్జిబిషన్లో ఆకట్టుకునేలా ఏర్పాట్లు చేసిన ఉత్తమ స్టాల్స్ నిర్వాహకులకు బహుమతులు ప్రదానం చేశారు. మీడియా రంగంలో విశేష సేవలందించినందుకు గాను సీనియర్ జర్నలిస్ట్ మన్నెపల్లి బస్వరాజును శాలువాతో సత్కరించి, విశిష్ట అవార్డు  అందజేశారు. అంతకుముందు సొసైటీ సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు.