calender_icon.png 15 February, 2026 | 1:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంజీవయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం

15-02-2026 12:00:00 AM

  1. కర్నూలు జిల్లాకు ఆయన పేరు పెట్టాలి
  2. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): నిజాయితీకి, విలువలకు మారుపేరుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అని, ఆయన జీవితాన్ని నేటితరం ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అన్నారు.

ఆయన 105వ జయంతి సందర్భంగా...  అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి, అనంతరం సంజీవయ్య పార్క్‌లో ఆయన సమాధి వద్ద మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతె రోహిత్‌తో కలిసి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విహెచ్ మాట్లాడుతూ... దేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు అవకాశం కల్పించిందన్నారు.

ఏపీ కర్నూల్‌లో దామోదరం సంజీవయ్య పుట్టి పెరిగిన చోట సృ్మతి వనం నిర్మించాలని వీహెచ్... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్ తరాలకు ఆయన పేరు గుర్తుండిపోయే విధంగా కర్నూల్ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.