కాంగ్రెస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యం
షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్, ఫిబ్రవరి 7, (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ తోనే సామాజిక న్యాయం సాధ్యమని...కాంగ్రెస్ ముమ్మాటికి బడుగు, బలహీన వర్గాల పార్టీ అని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ,బిసి కులగణన అసెంబ్లీలో ఆమోదం పొందిన సందర్భంగా శుక్రవారం షాద్ గర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని నాగులపల్లి గ్రామంలో నిర్వహించిన సంబరాలలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం రూ.1కోటి 70 లక్షల నిధుల తో షాద్ నగర్ నుండి ఈదులపల్లి వరకు, నాగులపల్లి మీదుగా,నాగులపల్లి నుండి రాసమళ్ళ గూడ వరకు బీ.టీ రోడ్డు రూ.(60 లక్షలు) పను లకు , గ్రామంలో ఏస్ డి ఫ్ రూ.7.0 లక్షల నిధులతో ఎస్సీ కాలనీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫిబ్రవరి 4 వ తేదీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని ఒక సువర్ణ దినంగా మారింది అన్నారు.
గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఫలితాలను కేవలం తమ రాజ కీయ ప్రయోజనాలకు మాత్రమే వాడుకు న్నారని ఆయన విమర్శించారు. కేవలం లిమ్కా బుక్ రికార్డ్ కోసం నివేదికలు పంపిన గత పాలకులు ప్రజల సమక్షంలో ఎందుకు నివేదికలు ఎందుకు పెట్టలేదని,చట్టబద్ధత ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
బీసీల సంఖ్య తగ్గిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు....ఇంతటి మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల రాజకీయ ఉనికి దెబ్బ తింటుందని కొందరు మూర్ఖులు తమ అభద్రత భావాన్ని చెప్పలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏ పథకం అమలు చేసినా కులాలకు అతీతంగా,రాజకీయాలకు అతీతంగా సామాజిక న్యాయంతో ముందుకు సాగుతుందని తెలిపారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కాంగ్రెస్ సైనికులు ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాలు తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్,బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు బాలరాజు గౌడ్, కొండూర్గ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కృష్ణా రెడ్డి, నాయకులు రఘు నాయక్, ఇబ్రహీం, అరుంధతి, రాజు, రాములు గౌడ్,యాదయ్య, బీరప్ప తదితరులు పాల్గొన్నారు.




