3 April, 2026 | 1:50 AM

ఈ ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించిన కలెక్టర్

08-02-2025 12:00 AM

రంగారెడ్డి, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టము ఈ ఆన్లైన్ పోర్టల్‌ను  జిల్లా  కలెక్టర్ నారాయణరెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ప్రారంభించారు. ఈ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రంగారెడ్డి పట్టణ భూ పరిమితి చట్టం కు సంబందించిన అన్ని కోర్టు వివాదాల వివరాలను ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రభుత్వ భూములు అన్యకాంతం కాకుండా  ఈ ఫోర్టల్ ఉపయోగపడుతుంద న్నారు. దీనివలన కోర్టు వివాదములకు చెందిన సమగ్ర సమాచారం అనగా... కోర్టు కేసు వారీగా కక్షిదారుల సమాచారం, సర్వే నంబర్, గ్రామం, కేసు పూర్వాపరాలు, కేసు ప్రస్తుత స్థితి, కేసు వాయిదాల  సమగ్ర సమాచారం   అందుబాటులో  ఉండే అవకాశం ఉందన్నారు.

ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా కొనసాగుతుందన్నారు.ఈ పోర్టల్  తేవడం వల్ల  కోర్టు కేసులు వివాదములలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణకు, ఆయా శాఖల అధికారులకు  భూములకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం  తక్షణ ఆదేశాలు, సూచనలు జారీ చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆయన గుర్తు చేశారు.

ఈ పోర్టల్ ద్వారా మరుసటి రోజు వాయిదా ఉన్న కోర్టు కేసుల వివరములు కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు  భూ కేసుల విషయంలో  జాప్యానికి / నిర్లక్ష్యానికి తావు లేకుండా అర్బన్ ల్యాండ్ సీలింగ్ కేసుల విషయంలో సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండడానికి ఈ  ’ECourt-ULC RR’ సహాయపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.