11 May, 2026 | 1:33 AM

పార్టీలో సామాజిక న్యాయమే కాంగ్రెస్ లక్ష్యం

11-05-2026 12:00 AM

ఎస్సీ విభాగం ఉమ్మడి జిల్లా పరిశీలకులు సుదర్శన్...

ఆదిలాబాద్, మే 10 (విజయక్రాంతి) :కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో భాగంగా ఏఐసీసీ, టీపీసీసీ ల ఆదేశాల మేరకు ఎస్సీ విభాగం పదవుల భర్తీకి ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ విభాగం నియామక పరిశీలకులు సమతా సుదర్శన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ విభాగం జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆదివారం జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.

ఈ సందర్భంగా సమతా సుదర్శన్ మాట్లాడుతూ... దేశంలో ఉన్న అన్ని కులాలు, వర్గాలకు న్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ నాయకులు మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ఎస్సీ విభాగనికి పదవుల కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలని మతం పేరుతో అణచి వేసే పని చేస్తుందని ఆరోపించారు.

బీజేపీ కుట్రలను కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తిప్పి కొట్టి రాహుల్ గాంధీ ని ప్రధాన మంత్రి ని చేయడం లక్ష్యంగా పని చేయాలనీ పిలుపునిచ్చారు.అంతకుముందు డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి పనిచేస్తోందని, ఎస్సీ వర్గాలకు పార్టీలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నదన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసే నాయకులకు అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

పార్టీ అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేసే వారు ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ మార్కెట్ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ తన్వీర్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు లింగం పల్లి చంద్రయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దీపక్, మాధవ్ పటేల్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లు బండి దేవిదాస్, గౌలి సంజీవ్, యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ దౌలత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.