11 May, 2026 | 1:32 AM

ఎరువుల వ్యాపారుల సంఘం కార్యవర్గం ఎన్నిక

11-05-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,మే10( విజయ క్రాంతి): జిల్లా ఎరువుల వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వాసవీ భవనంలో సంఘ సభ్యుల సమక్షంలో నిర్వహించిన సమావేశంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అధ్యక్షుడిగా కాచం నాందేవ్, గౌరవ అధ్యక్షుడిగా తాటిపల్లి వినోద్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్. రాజన్న, అవనిదర్ గౌడ్, ప్రధాన కార్యదర్శులుగా ప్రకాష్, విశాల్, ఖలీద్ బిన్ యాఫై, సంయుక్త కార్యదర్శులుగా లక్ష్మణ్, సంతోష్, మహేష్, కోశాధికారులుగా టి. ఆశిష్, టి. గిరీష్ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా రామకృష్ణ, శివకుమార్, బి. తిరుపతి, సాగర్, ఏ. తిరుపతి, స్పోక్స్ పర్సన్గా తిరుపతి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాచం నాందేవ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎరువుల వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రైతులకు నాణ్యమైన ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటామని, వ్యాపారుల హక్కుల పరిరక్షణలో సంఘం ముందుంటుందని తెలిపారు. సంఘ బలోపేతానికి ప్రతి సభ్యుడు సహకరించాలని కోరారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను శాలువాలతో సన్మానించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు ఎరువుల వ్యాపారులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.