25-08-2025 01:15:09 AM
- మున్సిపల్ స్థలం కాపాడటంలో మౌనమెందుకు ?
- కోట్ల స్థలం అన్యాక్రాంతమైనా పట్టించుకోరా?
- కన్నెత్తి చూడరు.. ఫిర్యాదుచేస్తే పట్టించుకోరు
- అభివృద్ధి ముసుగులో అక్రమార్కులకు ప్రోత్సాహం
ఇబ్రహీంపట్నం, ఆగస్టు : మున్సిపల్ స్థలం కాపాడటంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మనకెందుకులే అన్నట్లు చూసీచూడనట్లు మౌనం పా టించడం పట్ల స్థానికంగా పలు అనుమానాలకు తావిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఆదిభ ట్ల మున్సిపాలిటీ పరిధిలోనీ కొంగరకలాన్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ తో పాటు కే న్స్, ఫాక్స్ కాన్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీల రాకతో ఈ ప్రాంతం భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కొంగరకలాన్ సమీపంలోని శ్లోక కన్వెన్షన్ హాల్ నిర్వాహకులు గతంలో మున్సిపాలిటీకి గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని ఆక్రమించి సీసీ రోడ్డుతో పాటు అక్రమంగా ప్ర హారి గోడను నిర్మించారు. ఇదంతా 388, 389, 390 సర్వే నెంబర్లు గల భూమిలో 668.31 గజాలు, అదేవిధంగా 680.03 గ జాలు ఈ రెండు కలిపి 1348.34 గజాల స్థ లాన్ని ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2021డిసెంబర్‌లో గిఫ్ట్‌డీడ్ చేశారు.
రూ.కోట్ల స్థలం అన్యాక్రాంతం
2021 నవంబర్ లో 726.93 గజాల స్థలాన్ని హెచ్‌ఎండీఏ కు మార్డిగేజ్ చేసి, 20 23 జూలై 1న హెచ్‌ఎండీఏ నుంచి రిలీజ్ చేశారు. అనంతరం 2023 సెప్టెంబర్ లో గిఫ్ట్ డీడ్ చేసిన స్థలాన్ని కూడా కలిపి తన భా ర్య పిండి అర్చన పేరున లీజ్ డీడ్ చేశారు. అయితే గిఫ్ట్ డీడ్ చేసిన 1348.34 స్థలం వి లువ సుమారుగా రూ.15 కోట్ల పైమాటే. అయినప్పటికీ మున్సిపల్ అధికారుల చర్య లు మాత్రం శూన్యం. కోట్ల స్థలం అన్యాక్రాం తం అవుతున్నా అధికారులపై సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి.
కన్నెత్తి చూడరు..
నిబంధనలకు విరుద్ధంగా జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ అధికారుల పూర్తిగా విఫలమవుతున్నారు. అక్రమం ఉన్న చోట అందినకాడికి దండుకుని, ఆ తర్వాత అక్రమం అని ఫిర్యాదులొస్తే అటువైపు కన్నెత్తి కూడా చూడరని స్థానికంగా ఆరోపణలు ఉన్నాయి. అయితే గిఫ్ట్ డీడ్ చేసిన స్థలం అక్రమంగా సీసీ రోడ్డు, ప్రహరీ గోడ నిర్మించడమే కాకుండా, శ్లోక యజమాని, తన భార్య పేరిట లీజ్ డీడ్ చేసి దీనిపై బ్యాంకు లోన్ సైతం పొందారు. ఇం త జరుగుతున్న మరి మున్సిపల్ అధికారు లు ఏం చేస్తున్నట్టు అనేది స్థానిక ప్రజలు ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. అభివృద్ధి ముసుగులో అక్రమాలను ప్రోత్సహించి మున్సిపా లిటీనీ అక్రమాలకు అడ్డాగా మార్చవద్దని స్థానికులు కోరుతున్నారు.