కమలాపూర్ చెరువు వద్ద సొసైటీ సభ్యుల ఆందోళన
ప్రైవేట్ వ్యక్తులపై చర్యలకు డిమాండ్
భీమిని, ఏప్రిల్ 29 : భీమిని మండలంలో ని కమలాపూర్ ప్రాజెక్టు చెరువులో అక్రమంగా చేపలు పట్టే ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పెద్దపేట మత్స్యకార సొసైటీ సంఘం సభ్యులు బుధవారం కమలాపూర్ చెరువు వద్ద ఆందోళనకు దిగారు. కమలాపూ ర్ చేపల చెరువులో ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా చేపలు పట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పెద్ద పేట సొసైటీలో అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రైవేట్ దళారులతో చేతులు కలిపి దందాకు ఒడికట్టినట్లు చెప్పుకొచ్చారు. గత పది సంవత్సరాల నుండి భీమిని మత్స్యకార సొసైటీ ఏర్పడిందనీ, మూడు సం వత్సరాలుగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తితో సొసైటీలో ఉండే అధ్యక్షుడు మరి కొంతమంది సొసైటీ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా చెరువును లీజుకు ఇచ్చినట్లు తెలిపారు.
చేపలు పట్టుకునేందుకు చెరువు వద్దకు వెళితే అక్కడ కాపలా పెట్టిన ప్రైవేటు వ్యక్తి మీరు చాపలు ఎలా పడతారో చూస్తానంటూ బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో మత్స్యశాఖ అధికారి అవినాష్ కు సమస్యపై పలుమార్లు సమాచారం అందించినప్పటికీ అధికారి పట్టించుకోలేదన్నారు. ప్రతి ఏటా ప్రభుత్వానికి లీజు అమౌం ట్ చెల్లిస్తున్నామన్నారు. సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోకపో వడంతో చెరువులోని చాపలను అక్రమ మార్గంలో కాగజ్‌నగర్ పట్టణానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.
ఈ విషయంలో మండలానికి చెందిన ఓ రాజకీయ నాయకుని హస్తం ఉన్నట్లు ఆరోపిం చారు. నాయకుని కనుసన్నుల్లోనే ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నట్లు తెలిపారు. అంతేకా కుండా అర్హులైన సొసైటీ సభ్యులను తన మాట వినకపోవడంతో దూరం పెట్టినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల మత్స్య సంపదలను అక్రమంగా బయటికి దాటిస్తూ కోట్లు గడిస్తున్నారని తెలిపారు. సొసైటీలో తలెత్తిన వివా దం కారణంగా సొసైటీ అధ్యక్షుడిగా వ్యవహరించే వ్యక్తి కక్ష సాధింపు చర్యలకు పాల్పడు తున్నాడని అన్నారు. కమలాపూర్ చెరువులో చేపలు పట్టే ప్రైవేట్ వ్యక్తులపై భీమిని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.






