30 April, 2026 | 3:41 AM

భీమినిలో గుప్తనిధుల కలకలం

30-04-2026 02:32 AM

కమలాపూర్ చెరువు వద్ద ఘటన 

భీమిని, ఏప్రిల్ 29: మండలంలోని కమలాపూర్ చెరువు వద్ద గల పోచమ్మ తల్లి విగ్ర హం ఎదుట గుప్త నిధుల కోసం తవ్వకాలు బుధవారం మండలంలో కలకలం సృష్టించిం ది. వివరాలిలా ఉన్నాయి.. భీమిని మండలం కమలాపూర్ చెరువుకు అనుకోని ఉన్న కెనాల్ పక్కన  పోచమ్మ విగ్రహం వద్ద గుర్తు తెలియ ని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసినట్లు సమాచారం.

ఉదయం పంట చేలల్లో పనుల కోసం వెళ్లిన రైతులు పోచమ్మ విగ్ర హం వద్ద పెద్ద గొయ్యి కనిపించడంతో ఆందోళన చెందిన రైతులు గుప్త నిధుల కోసమే తవ్వ కాలు జరిపినట్లు అనుమానించారు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా దావానంలా వ్యాపించిం ది. తవ్వకాలు జరిగిన ప్రాంతంలో గతంలో కమలాపూర్ గ్రామం ఉండేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రతి ఏటా పండించిన దినుసుతో పోచమ్మ తల్లి వద్ద మొక్కులు చెల్లించ డం ఆనవాయితీ అని, గుప్త నిధుల కోసమే పోచమ్మ తల్లి విగ్రహం ఎదుట తవ్వకాలు జరిపారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.