23 August, 2026 | 2:43 AM

సత్యానికి సమాజం తలవంచాలి

23-08-2026 01:23 AM
  1. మౌనం సమాజానికి నష్టం
  2. అన్యాయాలపై ప్రశ్నించాలి
  3. బెల్లంపల్లిలో సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి
  4. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక

బెల్లంపల్లి/మందమర్రి, ఆగస్టు 22 (విజయక్రాంతి): సమాజం సత్యానికి లోబడి ఉండాల ని, అన్యాయాలపై ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సివిల్ కోర్టు నూతన భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొ ని మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న అ న్యాయాలపై ప్రతి ఒక్కరు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మంచివాడి మౌనం సమాజానికి తీరని నష్టం చేస్తుందని తెలిపారు.

శాంతియుతంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని ఉద్భోదిం చారు. మత్తు పదార్థాల బారిన పడి యువత నిర్వీర్యం అవుతున్నదని ఆందోళన వ్యక్తంచేశా రు. మత్తు పదార్థాల నుంచి యువతను బయటపడేయాలని అభిప్రాయపడ్డారు. యువతలో నైతికతను దెబ్బతీసే మత్తు పదార్థాలపై అంద రూ పోరాడాలనీపిలుపునిచ్చారు. అంతర్గత ప్రాచాత్య సంస్కృతి మానవ నైతికతను దెబ్బతీస్తున్నదని స్పష్టంచేశారు. సబ్ కోర్టు కోసం ప్రతిపాదనలు పంపితే, మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలకు సత్వర ఉన్నత న్యాయ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం ఎల్లప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటించారు. అంతకుముందు మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేసిన కోర్ట్ ఆఫ్ జూనియర్ సివిల్ జడ్జ్- కమ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టును మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఏ వీరయ్య, శారదా దేవి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల జిల్లా రెండవ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్, మందమర్రి కోర్ట్ ఆఫ్ జూని యర్ సివిల్ జడ్జ్- కమ్- జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఇంచార్జ్ జడ్జ్ కే నిరోష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మందమర్రి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, మంచిర్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త సత్తయ్యతో కలిసి హాజ రై గౌరవ వందనం స్వీకరించి మొక్కలు నాటా రు.

అనంతరం మూడు మతాల పెద్దల సమక్షంలో కోర్టు భవనాన్ని ప్రారంభించారు. కార్య క్రమంలో జిల్లా న్యాయమూర్తి ఏ వీరయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, బెల్లంపల్లి సివిల్ కోర్టు న్యాయమూర్తి శాంతి సోనీ, మందమర్రి జీఎం రాధాకృష్ణ, బెల్లంపల్లి బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు ఠాగూర్ గోపి కిషన్ సింగ్, శివకుమార్, అశోక్, మనోహర్, ఏజీపీ లక్ష్మీకాంత్, హైకోర్టు న్యాయవాది కిరణ్, మం చిర్యాల సివిల్ జూనియర్ కోర్టు న్యాయమూర్తి రామ్మోహన్‌రెడ్డి, అనిల్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.