calender_icon.png 25 November, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉరి వేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

25-11-2025 08:13:22 PM

ఘట్ కేసర్ (విజయక్రాంతి):సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోచారం ఐటీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, ఐపిడి కాలనీకి చెందిన కుర్ర పవన్ కళ్యాణ్ రెడ్డి(26) పోచారం ఇన్ఫోసిస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ​మృతుడు పోచారంలోని సింగపూర్ టౌన్‌షిప్, ఫ్లాట్ నెం. 305 లో అద్దెకు ఉంటున్నాడు.

ఈనెల 24న ఉదయం 9 గంటల సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పవన్ కళ్యాణ్ రెడ్డి బెడ్ షీట్ సహాయంతో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అతని రూమ్‌మేట్స్ విజయ్, నిఖిల్ మృతుడి తండ్రి కుర్ర శ్రీనివాస్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. ​ఫిర్యాదుదారుడు శ్రీనివాస్ రెడ్డిని విచారించగా, తన కుమారుడు ఒక అమ్మాయిని ప్రేమించాడని, అయితే ఆ ప్రేమ విఫలం అవ్వడం వల్ల అతను కలత చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. తన కుమారుడి మరణంపై తనకు ఎలాంటి అనుమానం లేదని  తెలపడంతో ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.