25-11-2025 08:15:16 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తన స్థలంలో నిర్మించిన రేకుల రూములను హైడ్రా అధికారులు అన్యాయంగా కూల్చివేశారని బాధితుడు ముగ్ధం ఈశ్వర్ ఆరోపించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన రెండు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయని, వీటికి ఇంటి నెంబర్ తీసుకొని, సకాలంలో ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నామని చెప్పారు. తాను కొనుగోలు చేసిన భూమికి మధ్యవర్తిగా ఉన్న వ్యక్తే ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు.