20 March, 2026 | 9:26 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

సనత్‌నగర్‌లో విషాదం

22-07-2024 12:33 AM

అనుమానాస్పద రీతిలో ముగ్గురు మృతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (విజయక్రాంతి): సనత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలోని ముగ్గురు బాత్‌రూమ్‌లో విగతజీవులుగా పడి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే ఆర్ వెంకటేశ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జెక్ కాలనీలోని ఆకృతి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని 204వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నా డు. ఆదివారం ఉదయం పనిమనిషి ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరూ కనిపించలేదు.

బాత్‌రూమ్‌లో ఉన్నారేమోనని ఇంట్లో పని ముగించుకొని వెళ్లిపోయింది. తిరిగి సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చినపుడు కూడా ఎవరూ కనిపించలేదు. బాత్‌రూమ్ డోర్‌లాక్ అలాగే ఉండడంతో అనుమానం వచ్చి అపార్ట్‌మెంట్ నిర్వాహకులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని బాత్‌రూమ్ డోర్ పగులగొట్టి చూడగా వెంకటేశ్ (50), మాధవి (50)తో పాటు వారి కుమారుడు హరి (30) విగతజీవులుగా పడి ఉన్నారు. తొలుత విద్యుదా ఘాతంతో మృతిచెందినట్టు భావించినప్పటికీ, అలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా దవాఖానకు తరలించారు.