18-11-2025 12:57:11 AM
-పీఎం కుసుమ్ ఆధ్వర్యంలో నిర్వహణ
-రైతులకు సోలార్ ఎనర్జీపై అవగాహన
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్ అసోసియేషన్ (టీజీపీఎంకేఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో నవంబర్ 16 తేదీల్లో నాంప ల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో సోలార్ ఫార్మర్స్ సమ్మిట్ నిర్వహించారు. రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు, సోలార్ పరిశ్రమ ప్రతినిధులు, టెక్నికల్ నిపుణులు, బ్యాంకింగ్ సంస్థల సక్రియ పాల్గొని విజయవంతం చేశా రు. సమ్మిట్‌లో సోలార్ ప్లాంట్ల వ్యవస్థాపన, సబ్సిడీ నిర్మాణం, బ్యాంకు ఫైనాన్సింగ్, పరికరాల నాణ్యత, మెయింటెనెన్స్ పద్ధతులు, దీర్ఘకాల ప్రయోజనాలపై రైతులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.
సోలార్ కంపోనెం ట్లు, పనితీరు, యంత్రాంగ నమ్మకత, ఎనర్జీ జనరేషన్ సామర్థ్యంపై నిపుణులు సవివరంగా వివరించారు. మాన్యుఫ్యాక్చరర్ కనెక్ట్.. జాతీ య స్థాయి సోలార్ కంపెనీలు తమ తాజా ప్యానెల్స్, పంపులు, ఇన్వర్టర్లు యుటిలిటీస్కేల్ సొల్యూషన్లను ప్రదర్శించాయి. పాలసీ డైలా గ్.. కేంద్రరాష్ట్ర సబ్సిడీలు, అనుమతులు, బ్యాం కు లోన్ విధానం, అమలు సమస్యలపై అధికారులతో చర్చ జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ‘గతంలో సోలార్ సిస్టమ్స్ అధిక ఖర్చుతో ఉండటంతో పెద్దవారికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ పరికరాల ధరలు తగ్గడం, అవగాహన పెరగ డం వల్ల చిన్న రైతులకూ సోలార్ అందుబాటులోకి వచ్చింది. సమ్మిట్ రైతులకు పూర్తిస్థా యి అవగాహన కల్పించిన కార్యక్రమం’ అన్నా రు.
టీజీపీఎంకేఎఫ్‌ఏ అడ్వైజర్ సంతోష్‌రావు బలిగిరి మాట్లాడుతూ.. ‘ఈ సమ్మిట్ ద్వారా ఫైనాన్సింగ్, ప్రభుత్వ సహాయం, సరైన టెక్నాలజీ ఎంపిక, రాబడి మోడల్స్ వంటి అన్ని అంశాలను సమగ్రంగా వివరించగలిగాము’ అని చెప్పారు. తెలంగాణ పీఎం కుసుమ్ ఫార్మర్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సాంకేతిక సహాయం, అవ గాహన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.