18-11-2025 12:57:39 AM
తాత, తల్లిదండ్రులు మృతి
సంగారెడ్డి(విజయక్రాంతి)/జహీరాబాద్: సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే ఒక్కడు మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన మౌలానా పెద్ద కూతురు గౌసియా బేగంను హైదరాబాద్ మెహదీపట్నం బిర్రాకు చెందిన ఖదీర్‌తో వివాహం జరిపించారు. సౌదీలోని మక్కా మసీదును దర్శించుకోవడానికి మౌలానా, కూతురు గౌసియా బేగం, అల్లుడు ఖదీర్, మనువడు సోయల్(22) వెళ్లారు.
ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో మౌలానా, గౌసియా బేగం, ఖదీర్ అందరూ సజీవ దహనం కాగా సోయల్ ఒక్కడే కిటికీలోంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. కాళ్లు విరగడంతో సౌదీలోనే చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అయితే సోయల్ పరిస్థితి కూడా కొంత విషమంగానే ఉన్నట్లు సమాచారం.