సూర్యక్షేత్రంలో సౌర హోమం
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి)జూలై 19: తె లంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండ లం తిమ్మాపురం గ్రామ శివారులో నిర్మించిన అఖండ జ్యోతి స్వరూప సూర్యనారా యణ స్వామి మహా క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెల్లవారుజామున ఉషాపద్మినీఛాయా సమేత సూర్యనా రాయణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు.అనంతరం యజ్ఞశాలలో మహాసౌర హోమం నిర్వహించారు.
క్షేత్ర ఆవరణలోని కార్యసిద్ధి వీర హనుమా న్,శ్రీరామ కోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు.వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలతో పాటు అన్న ప్రసాద సత్రంలో అన్నదానం చేశారు.ఈ కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితాజనార్ధన్, గణపురం నరేష్,మారం కోటిరెడ్డి, ఉప్పల రాజేష్,అర్చకులు భీంపాండే,అంకిత్ పాండే, భక్తులు పాల్గొన్నారు.






