‘గుట్ట’ ధర్మకర్తగా తూళ్ల విజయేందర్ ప్రమాణం
20-07-2026 01:42 AM
యాదగిరిగుట్ట, జూలై 19 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి సభ్యులుగా తూళ్ళ విజయేందర్ గౌడ్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నెల 11న చైర్మన్, సభ్యులు ప్రమాణ స్వీకారం చేయగా తూళ్ళ విజయేందర్ అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారు.
దీంతో ఉదయం 11:-09లకు ప్రధానాలయ ముఖమండపం బంగారు వాకిలి ప్రాంగణంలో కార్య నిర్వాహణాధికారి భవాని శంకర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ధర్మకర్త విజయేందర్ గౌడ్ కుటుంబ సభ్యులకు వేదపండితులు ఆశీర్వచనాలు అందజేసి స్వామి వారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందజేశారు.






