20 July, 2026 | 8:41 PM

ఆలేరు చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం

20-07-2026 01:40 AM

ఆలేరు, జూలై 19 : ఆలేరు చేనేత పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం ఘనం గా జరిగింది. పట్టణంలోని శ్రీ ఆచార్య కొం డా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన చేనేత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ దాసి శంకర్ మరియు వారి కార్యవర్గ బృందం చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభు త్వం కట్టుబడి ఉందని, చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నూతన పాలకవర్గం సంఘ అభివృద్ధికి, చేనేత కళాకారుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బండ్రు శోభారాణి, జనగాం ఉపేందర్ రెడ్డి, బీజాని బాలమణి, విజయకుమార్, నీలం పద్మ, పద్మశాలి కుల బాంధవులు, చేనేత కళాకారులు, సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.