24 August, 2026 | 9:10 AM

తెలంగాణ కోసం ఆస్తులమ్మి..

13-06-2024 02:30 AM

తెలంగాణ కోసం అమరులైన వారు కొందరైతే.. సర్వం కోల్పోయిన వారు మరికొందరు. జనగామ మండలం శామీర్‌పేట గ్రామానికి చెందిన మేకల కళింగరాజు ప్రస్తుతం ఎంపీపీగా పనిచేస్తున్నారు. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచే ఆ పార్టీలో ఉంటున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. జనగామలో జరిగిన అనేక పోరాటాలకు ఆయన నేతృత్వం వహించారు. తన భూములను సైతం ఉద్యమం కోసం అమ్మేయడం గమనార్హం. తెలంగాణ సిద్ధించాక బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. అయితే ఊరూరా కళింగరాజు ఆదరణను చూసిన ముత్తిరెడ్డి ఆయన పదేళ్లు పదవిలో ఉండి రాజకీయంగా అణిచివేశారనే ఆరోపణలున్నాయి. తెలంగాణ తెచ్చుకున్నంక నియంతృత్వం రూపు మారిందే తప్ప బతుకులు పెద్దగా బాగుపడిందేమీ లేదని కళింగరాజు అంటున్నారు.

 జనగామ ఎంపీపీ 

కళింగరాజు