'దోస్త్' కౌన్సెలింగ్ గడువు పొడిగింపు
12-06-2024 06:19 PM
హైదరాబాద్ : తెలంగాణ డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ కౌన్సెలింగ్ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. దోస్త్ తొలివిడతలో సీట్ల పొందినవారు సెల్ఫ్ రిపోర్టింగ్ కు, రెండో విడత రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువును పెంచుతు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడత సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును జూన్ 12 నుంచి 15కి, రెండో విడత రిజిస్ట్రేషన్ గడువు జూన్ 13 నుంచి 15కి, దోస్త్ ఫేజ్-2 వెబ్ ఆప్షన్ల నమోదు గడువును జూన్ 14 నుంచి 15 వరకు పెంచుతు నిర్ణయం తీసుకుంది.






