2 July, 2026 | 3:05 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

జూలైలో వస్తున్న ‘సోలోబాయ్’

08-06-2025 12:00 AM

బిగ్‌బాస్ షోతో పాపులర్ అయిన యంగ్ హీరో గౌతమ్ తాజాచిత్రం ‘సోలో బాయ్’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. నవీన్‌కుమార్ దర్శకత్వంలో సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సతీశ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్వేతా అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పోసాని కృష్ణమురళి, అనిత చైదరి, అరుణ్‌కుమార్, ఆర్కే మామ, షఫీ, డాక్టర్ భద్రం తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, సాంగ్ సినీప్రియులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో గౌతమ్.. కథానాయకి రమ్యతో కలిసి కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు.

గతంలో ‘ఆకాశ వీధుల్లో’ చిత్రంతో ఆకట్టుకున్న గౌతమ్.. ఇప్పుడు యూత్‌ఫుల్ కథతో, రొమాంటిక్ వైబ్‌తో, రెట్టింపు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్‌తో వస్తున్నాడు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: త్రిలోక్ సిద్ధు; సంగీతం: జుడా సంధ్య; పాటలు: కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, చైతన్యప్రసాద్, కల్యాణ్‌చక్రవర్తి.