calender_icon.png 1 February, 2026 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామక్కపేటలో నీటి సమస్యకు పరిష్కారం

01-02-2026 04:59:00 PM

- వార్డు సభ్యుల కృషి

సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో తాగునీటి సమస్యను ఉప సర్పంచ్ రవళి భానుచందర్, వార్డు సభ్యులు దేవలక్ష్మి రమేష్, సిద్ధుల కుమార్, క్రాంతి కుమార్, రాజు, బాలయ్య, రాంతెజ్, యాదగిరి, పద్మ రాజు, స్వప్న శ్రీకాంత్, లత దేవయ్య, స్రవంతి రమేష్ లు పరిష్కరించారు.

గ్రామంలో మిషన్ భగీరథ పథకం నీటి సరఫరాలో అంతరాయం కలిగినప్పుడు తాగునీటి సమస్య తలెత్తేదని అందుకే గ్రామంలోని నల్లాల బావి వద్ద గల బోరు నుండి గ్రామంలోనీ ప్రధాన వాటర్ ట్యాంక్ కు నూతనంగా పైప్ ఏర్పాటు చేశామని వార్డు సభ్యులు తెలిపారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యను, ప్రజలకు నిరంతరంగా ఉన్న తాగునీటి సరఫరాను పరిష్కరించడం తమకు దక్కిన అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు. గ్రామ సర్పంచ్ విఠోబా సహకారంతో వార్డు సభ్యులు ఈ సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు.