22 June, 2026 | 2:21 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

కరెంటు కష్టాలు తీర్చండి

11-06-2024 12:00 AM

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత తలెత్తుతున్న తీవ్రస్థాయి కరెంటు కష్టాలను ఉన్నతాధికారులు తీర్చే కోణంలో చర్యలు తీసుకుంటున్నట్టు వచ్చిన వార్తలు ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. విద్యుత్ సరఫరాలో పదేపదే ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేలా వారు ఆలోచనలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని ఆచరణలోకి తేవడంలో వారు చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. ప్రతి ఫీడర్‌ను సీఎండీ పరిశీలించేలా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీనిని హర్షించదగ్గ చర్యగా చెప్పాలి.

ఇందుకోసం ‘ఫీడర్ సర్వే’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఎస్పీడీసీఎల్ రూపొందించినట్టు చెబుతున్నారు. దీనితో 24 గంటల పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నమాట. అప్పుడు తరచూ కలిగే అంతరాయాలు, వాటికి కారణాలు అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు వస్తాయి. ఇదే సమయంలో అవి కలుగకుండా అన్ని చర్యలూ తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే కొత్త ప్రభుత్వానికి కరెంటు సరఫరా విషయంలో మంచి పేరు వస్తుంది.  

  ప్రభాకర్‌రెడ్డి, నాగార్జునసాగర్