9 May, 2026 | 3:44 AM

పరిశ్రమల సమస్యలను పరిష్కరించండి

10-08-2025 12:58 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో లఘు ఉద్యోగ భారతి ప్రతినిధులు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): లఘు ఉద్యోగ భారతి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచదర్‌రావును శనివారం హైదరాబాద్‌లో కలిసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా చిన్న తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరంగా చేయాల్సిన చర్యల గురించి లఘు ఉద్యోగ భారతి అఖిల భారత కౌన్సిల్ మెంబెర్స్ అనంథ్, అనిల్ వివరించారు. ఈ కార్యక్రమంలో లఘు ఉద్యోగ భారతి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కే నరేంద్రనాథ్ దత్, వైస్ ప్రెసిడెంట్స్ కావేరి రమేష్, సుధాకర్‌శర్మ, జైపాల్‌రెడ్డి, బద్రీనాథ్ పాల్గొన్నారు.