మంచినీటి సమస్యను పరిష్కరించండి
బీజేపీ నాయకులు
సనత్‌గర్, మార్చి 6 (విజయక్రాంతి) : బీకేగూడా డివిజన్లో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరాలో ప్రెషర్తో రావడం, అలాగే సరఫరా సమయాల్లో మార్పులు రావడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకు లు పేర్కొన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ సనత్నగర్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ కుమార్ నాయకత్వంలో పలువురు పార్టీ నాయకులు సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. బీకే గూడా ప్రాంతంలో తాగునీటి సరఫరాలో ప్రెషర్తో రావడం వల్ల ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.
సమ స్యను త్వరితగతిన పరిష్కరి స్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సీనియర్ నాయకులు లింగంపల్లి నర్సింగ్ రావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్ (నందు), బీజేపీ జిల్లా ఐటీ ఇన్చార్జ్ అశ్విని, ప్రధాన కార్యదర్శి సుధాకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు పి. నరేందర్, కుశాల్ కుమార్, స్థానికులు శ్రవణ్, వాణి, రజిని, శోభన్ బాబు, అఖిల్, సాయి, రాజు తదితరులు పాల్గొన్నారు.




