మృతుని కుటుంబానికి ఐదు లక్షలు అందజేత
కేటీఆర్ తరపున సాయం అందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సికింద్రాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసెంబర్ 5న జీడిమెట్లలో గుండెపోటు తో మృతి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కి గుండెపోటు వచ్చిన రోజు కూడా బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పరామర్శించారు. దురదృష్టవశాత్తు చికిత్సకు స్పందించక మరణించిన దామోదర్ కుటుంబాన్ని గతంలో పరామర్శించిన కేటీఆర్. దామోదర్ కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కేటీఆర్ తన వ్యక్తిగత హోదాలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేత కేటీఆర్ తరుపున దామోదర్ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహా యం అందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. దామోదర్ మరణించిన అప్పు డు కూడా అంతక్రియల నిమిత్తం లక్ష రూపాయలు అందజేసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దామోదర్ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని ఎమ్మెల్యే కృష్ణారావు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలనగర్ మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




