30 June, 2026 | 9:10 PM

Breaking News

తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •   సమగ్ర విచారణ జరిపి ఎలాంటి చర్యలు తీసుకోలేదు   •   సింగరేణి అధికారులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు టీబీజీకేఎస్ సంఘీభావం: కాపు కృష్ణ   •   మా పాఠశాలలో పిల్లలను చేర్పించండి   •   పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి ఘన సన్మానం: డీఎం అండ్ హెచ్ ఓ తుకారాం రాథోడ్   •  

వైద్యవిద్యార్థుల స్టుఫైండ్ సమస్యను పరిష్కరించండి

01-06-2025 12:29 AM

- నేషనల్ మెడికల్ కౌన్సిల్ చైర్మన్‌ను కోరిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల స్టుఫైండ్ సమస్యను పరి ష్కరించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్‌ను కోరారు.

శనివారం హైదరాబాద్ పర్య టనకు వచ్చిన ఎన్‌ఎంసీ చైర్మన్‌తో బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మంత్రి భేటీ అయ్యా రు. స్టుఫైండ్ విషయంలో విద్యార్థులను ఇబ్బందిపెడుతున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాల ని కోరారు. స్టూడెంట్స్ ఇచ్చిన రిప్రజంటేషన్ కాపీని చైర్మన్‌కు అందించారు.

రాష్ర్టంలో ప్రభుత్వరంగంలో ఒకేసారి భారీసంఖ్యలో కాలేజీలు పెరిగినందున, ఫాకల్టీ సర్దుబాటు, బిల్డింగుల విషయంలో అవసరమైన మినహాయింపులు ఇవ్వాలని మంత్రి కోరారు. ఎంబీ బీఎస్ సీట్లకు అనుగుణంగా పీజీ సీట్లు లేకపోవడం వల్ల, ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు ఇబ్బం దిపడుతున్నారని.. పీజీ సీట్ల సంఖ్యను కూడా పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

మంత్రి దామోదర చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన ఎన్‌ఎంసీ చైర్మన్.. మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లకు సంబంధించిన వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వైద్యవిద్య నాణ్యత తగ్గిపోకుండా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ చైర్మన్‌కు మంత్రి సూచించారు. 

అంతకుముందు ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ ఆహ్వా నం మేరకు విద్యార్థులు, టీచింగ్ ఫ్యాకల్టీతో సమావేశమైన ఎన్‌ఎంసీ చైర్మన్..ఉస్మానియా, గాంధీ వంటి కాలేజీల్లో సీటు రావడం ఇక్కడి విద్యార్థులకు దక్కిన అదృష్టంగా పేర్కొన్నారు. హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తూ, ఎన్‌ఎంసీ మాజీ సభ్యుడు, ప్రముఖ డాక్టర్ సూర్యనారాయణరాజు, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ నందకుమార్‌రెడ్డి, డీఎంఈ (అడ్మిన్) శివరామ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.