19-01-2026 12:11:14 AM
వేములవాడ, జనవరి 18,(విజయక్రాంతి)మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్క రించుకొని వేములవాడ నియోజకవర్గ పరిధిలోని పలు దేవాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడ రూర ల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని శ్రీ దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆలయం, వే ములవాడ పట్టణంలోని నాంపల్లి ప్రాం తంలో ఉన్న వీర బ్రహ్మేంద్ర స్వామి ఆల యం, అర్బన్ మండలం కొడుముంజ గ్రా మంలోని రామప్ప ఆలయాల్లో స్వామివారిని దర్శించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాల తో, శాంతి సుఖసంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.