calender_icon.png 6 November, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిటకిటలాడిన సోమశిల

06-11-2025 12:00:00 AM

కొల్లాపూర్ రూరల్, నవంబర్ 5: కొల్లాపూర్  మండల పరిధిలోని సోమశిల గ్రామంలో కార్తీక మాసం మాసం సందర్భంగా బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడింది. సోమశిల లలిత సోమేశ్వర  ఆలయం కార్తీకమాసం సందర్భంగా ఏపీ ,తెలంగాణ, రాయలసీమ నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సోమశిలకు చేరుకొని పుణ్య స్థానాలు ఆచరించారు. 

జ్యోతిర్లింగాలను దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు, ఆలయానికి వచ్చే భక్తులకు కమిటీ సభ్యులు భోజన సౌకర్యాలు  కల్పించారు, కొల్లాపూర్ డిపో నుంచి అధికారులు ప్రత్యేక ఆర్టిసి బస్సులు  నడిపించారు.

కల్వకుర్తి పట్టణంలో..

కల్వకుర్తి టౌన్ నవంబర్ 5 : కల్వకుర్తి పట్టణంలోని పలు దేవాలయాల్లో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల్లో  ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీకదీపాలను వెలిగించారు. కార్యక్రమంలో మహిళలు, యువతులు, పట్టణవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.