calender_icon.png 6 November, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణమ్మకు గంగా హారతి

06-11-2025 12:00:00 AM

గద్వాల్, నవంబర్ 5: కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం గద్వాలలోని నదీ అగ్రహారం వద్ద దేవస్థానం అర్చకులు కృష్ణమ్మకు విశేష పూజలు నిర్వహించి గంగాహారతులు ఇచ్చారు. పౌర్ణమి సందర్భంగా సంప్రదాయం ప్రకారం పుణ్యనదీ హారతి, జ్వాలా తోరణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి కృష్ణమ్మకు పూజలు చేసి గంగాహారతి పూజలో పాల్గొన్నారు.