calender_icon.png 10 November, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురి అరెస్ట్

10-11-2025 10:29:49 PM

నిందితుల నుండి రూ.5 లక్షల విలువైన బంగారం,  రూ. 50వేల విలువైన వెండి స్వాధీనం 

వివరాలు వెల్లడించిన ఎస్పీ నర్సింహా

సూర్యాపేట (విజయక్రాంతి): రాత్రి పూట ఆరుబయట నిద్రిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలో బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న 4 గురు నిందితులను అరెస్ట్ చేయగా వివరాలను జిల్లా ఎస్పీ కె.నరసింహ సోమవారం జిల్లా కేంద్రంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ నెల చివరి వారంలో అర్వపల్లి మండలంలో రెండు వరుస దొంగతనాలు జరుగగా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అయితే వీటిపై దర్యాప్తు చేస్తుండగా నమ్మదగిన సమాచారంతో సోమవారం మధ్యాహ్నం సీసీఎస్, ఆర్వపల్లి పోలీసుల ఆధ్వర్యంలో అర్వపల్లి మండల కేంద్రంలోని జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు అనుమానాస్పదంగా వచ్చాయన్నారు.

వాటిని పట్టుకుని వాటిపై ఉన్న నలుగురు వ్యక్తులను విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎదురులంక గ్రామం,  పోలవరం మండలం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి చెందిన ఓలేటి మహాలక్షాల రావు అలియాస్ మహా, చిన్న మల్ల గ్రామం, పెనుగొండ మండలం, వెస్ట్ గోదావరికి చెందిన గద్దెడ సురేంద్ర, అదే జిల్లా తణుకు మండలం, వీరభద్రపురం గ్రామంకు చెందిన అల్లేటి రాజేష్, వేదులూరు గ్రామంకు చెందిన వెంద్ర రాఘవేంద్రరావులుగా తమ వివరాలు చెప్పారన్నారు. వీరినీ అదుపులోకి తీసుకుని తనిఖీలు చేయగా రూ.5 లక్షల విలువైన 4.25 తులాల బంగారము, రూ.50 వేల విలువైన వెండి లభ్యమయ్యాయన్నారు. వెంటనే వారి నుండి రెండు వాహనాలు, నాలుగు మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని పూర్తిస్థాయి విచారణ చేపట్టారన్నారు.

వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రిపూట తలుపులు తీసి నిద్రిస్తున్న ఇంట్లో, ఆరు బయట నిద్రిస్తున్న వారిని టార్గెట్ గా చేసుకొని వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లో వస్తువులు దొంగలిస్తున్నట్లు చెప్పారన్నారు. గత నెలలో అర్వపల్లి, నాగారం, తుంగతుర్తి, శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ల పరిధిలో రాత్రిపూట దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు దొంగతనాలకు పాల్పడ్డారన్నారు. ఈ ముఠాను పట్టుకోవడంలో విశేషంగా పనిచేసిన సిసిఎస్సిఐ, సిసిఎస్ ఎస్ఐ, సిసిఎస్ స్టాఫ్, సీఐ నాగారం, ఎస్సై అర్వపల్లి, సిబ్బందిని అభినందించారు. ఈ కేసు విషయంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి ప్రసన్న కుమార్, సిఐ నాగేశ్వరరావు, సిసిఎస్ ఎస్ఐ హరికృష్ణ, అర్వపల్లి ఎస్సై సైదులు సిబ్బంది పాల్గొన్నారు.