17-01-2026 04:14:11 AM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, స్టార్ హీరో విజయ్ సేతుపతి కలయికలో ఓ పాన్-ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ‘పూరి-సేతుపతి’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పూరి కనెకట్స్ బ్యానర్‌పై పూరి జగన్నా థ్, చార్మీ కౌర్.. జేబీ మోహ న్ పిక్చర్స్ జేబీ నారాయణరావు కొండ్రోల్లాతో కలిసి నిర్మిస్తున్నారు. విజయ్ సేతుపతి పు ట్టిన రోజు సందర్భంగా మేక ర్స్ ఈ మూవీ టైటిల్, ఫస్ట్-లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమా కు ‘స్లమ్ డాగ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘33 టెం పుల్ రోడ్’ అనేది ఈ మూవీకి ట్యాగ్‌లైన్.
ఈ విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి వైల్డ్ అవతార్‌లో, ఇంటెన్స్‌లు క్‌లో కనిపించారు. ఇందులో విజయ్ సేతుపతి సరసన సం యుక్త మీన న్ కథానాయికగా నటిస్తుస్తోంది. టబు, దునియా విజయ్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో బ్ర హ్మాజీ, వీటీవీ గణేశ్ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సం గీ తం సమకూర్చుతున్న ఈ సిని మా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ -ఇండియా రిలీజ్ కా నుంది.