12-08-2025 12:00:00 AM
ఆస్తి లాక్కున్నారు.. ఎయిడ్స్ ఉందని నెపంతో గెంటేశారు.
కలెక్టర్ ఎదుట వృద్ధురాలి ఆవేదన..
గద్వాల టౌన్ ఆగస్టు 11 : నవ మాసాలు మోసి పురిటి నొప్పుల భాదను సైతం సంతోషం గా భరిస్తూ కొడుకును జన్మనిచ్చిన తల్లి పాలిట భార్య తో కలిసి కాలయముడిగా మారిన సంఘటనను సోమవారం కలెక్టర్ కార్యాలయ ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ సంతోష్ ఎదుట కన్నీళ్లు పెట్టుకుంటూ వివరించిన సంఘటన చోటు చేసుకుంది.
గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హుస్సేన్బీ(80) తెలిపిన వివరాల ప్రకారంగా తన పేరు మీద ఉన్న ఆస్తిని రెండవ కుమారుడు ఇస్మాయిల్, కోడలు సాభేరా భాను రాయించుకుని వీధిలోకి నెట్టివేయడం తో పాటు అదనంగా తనకు ఎలాంటి రోగం లేనప్పటికి ఎయిడ్స్ ఉందని ప్రచారం చేయడం భరించలేనంత భాదగా ఉందని కలెక్టర్ ముందు తన గోడు ను వెళ్ళబోసుకుంది.
విషయం తెలుసుకున్న సీనియర్ సిటిజన్ ఫోరం అధ్యక్షులు కె.మోహన్రావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్కు, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావులకు వృద్ధురాలి తో వేర్వేరుగా ఫిర్యాదు చేయించారు. కలెక్టర్ స్పందిస్తూ సదరు కోడలు,కుమారునిపై తగు చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.