10 April, 2026 | 3:06 PM

Breaking News

అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •  

కన్నతల్లికి ఎంత కష్టం

10-04-2026 01:22 PM
  1. అందరు చూస్తుండగానే తల్లిపై కొడుకు దాడి 
  2. ఇదివరకే తల్లిపై మూడు సార్లు దాడి 
  3.  ఇళ్లల్లో పాచిపని చేసే రాములమ్మకు ప్రాణ గండం 
  4. పోలీసుల చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?

షాద్‌నగర్,(విజయక్రాంతి): నవ మాసాలు మోసి కనిపించిన తల్లిని ఇస్తాను సారంగా బూతులు తిడుతూ కొడుతున్నాడు ఓ కొడుకు.. ఇలా ఒక్కసారి కాదు  గతంలో రెండుసార్లు కూడా తల్లిపై  చేసుకున్నాడు. తాజాగా నిన్న బహిరంగంగా అందరూ చూస్తుండగానే తల్లిని చావబాదాడు. షాద్ నగర్ పట్టణంలోనీ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే నాగులపల్లికి చెందిన చాకలి రాములమ్మ పై అతని కుమారుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. స్థానిక  గ్యాస్ ఏజెన్సీ లో పనిచేస్తున్న రాజు ఇలా ఘాతుకాలకు ఒడిగడుతున్నాడు.

నాగులపల్లిలో ఉన్న ఇంటి విషయంలో వివాదం పెంచుకొని రాజు కన్నతల్లి పై దాడి చేశాడు. రాజుకు పెళ్లి చేశాక ఆమెను ఇంటి నుండి బయటకు గెంటేశాడు. సంవత్సర కాలంగా ఆమె బయట అద్దె ఇంట్లో ఉంటుంది. వెంకటేశ్వర కాలనీ రైతు కాలనీ పిల్లలు పలువురి ఇండ్లలో ఆమె పాచి పని చేసుకుని పొట్ట పోసుకుంటుంది. ఆమె కుటుంబం ఎంతోకాలం వెంకటేశ్వర కాలనీలో ఉన్న ఇస్త్రీ డబ్బాలో తలదాచుకుని జీవనం సాగిస్తుండేది. 27వ వార్డులో ఉన్న నాయకులు పరిచయస్తులు ఎంతోమంది ఆమె దీనస్థితిపై జాలిపడి ప్రభుత్వం ద్వారా ఇందిరమ్మ డబ్బులు బెడ్ రూమ్ కూడా ఇటీవలే ఇచ్చారు.

ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ పుణ్యమా అని ఓ నీడ దొరికింది. అయితే అయినదానికి కాని దానికి తల్లిని టార్గెట్ చేస్తూ రాజు పలు సందర్భాల్లో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. పదిమంది ఇళ్లలో పాచి పని చేసుకుంటూ కొడుకు వద్ద ఉన్న సమయంలో అతనికి ఆర్థికంగా కూడా సహాయపడేది. రాజు పెళ్లి అయ్యాక ఇంట్లో జరిగిన గొడవల కారణంగా తల్లిని బయటికి గెంటేశారు. ఇంక తనలో రెండు సందర్భాలలో రాములమ్మ పై కన్నా కొడుకు రాజు చేయి చేసుకున్నాడు. మళ్లీ ఇప్పుడు తాజాగా తల్లి పై చక్షణారహితంగా దాడి చేశాడు. 

పోలీసుల చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? 

షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో రాములమ్మ తన కొడుకు పై ఫిర్యాదు చేసింది. నిన్న దాడి సందర్భంగా స్థానికులు కొందరు అడ్డుపడి ఆమెను విడిపించారు. అక్కడే ఉంటే చంపేస్తాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయమని స్థానికులు చెప్పడంతో ఆమె బతుకు జీవుడా అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. అక్కడ ఫిర్యాదు చేసింది. నువ్వు ఇంటికి వెళ్లి ఉండు మేము వస్తాము చర్యలు తీసుకుంటామని చెప్పిన ఎవరో పోలీసు సిబ్బంది ఇప్పటివరకు ఆమెను పట్టించుకోలేదు. కొడుకు చేతిలో చావు దెబ్బలు తింటూ, ఎవరు చూడకపోతే తనను చంపేస్తాడని ఆ తల్లి క్షణం ఒక యుగంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్ళదీస్తుంది.