12 May, 2026 | 4:38 PM

తండ్రి దినకర్మ రోజు తనయుని ఆత్మహత్య

12-05-2026 04:08 PM

ఐదు రోజుల్లో ఇద్దరు మృతి

ఎల్లారెడ్డి పేట,(విజయక్రాంతి): ఆటో డ్రైవర్ అయిన పాముల భాస్కర్.. తన తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా తన దినకర్మ అనంతరం ఓ చెట్టుకు ఉరివేసుకొని కొడుకు భాస్కర్ చనిపోయిన ఘటన దుమల గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామానికి చెందిన పాముల భాస్కర్ (45) తన తండ్రి ఐదు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. తన తండ్రి దినకర్మ సోమవారం జరిపించారు.

తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అదే విధంగా ఆర్థిక ఇబ్బందులు తోడు కావడంతో కలత చెంది సోమవారం రాత్రి గ్రామ శివారులోని ఓ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అటుగా వెళుతున్న స్థానికులు చూసి సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి  భార్య, ఇద్దరు కూతుర్లు,ఒక కుమారుడు ఉన్నారు. ఐదు రోజుల్లో తండ్రి కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతుని కుటుంబంను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక సర్పంచ్ శరవింద్,ప్రజలు కోరారు.