23 March, 2026 | 12:48 PM

కుటుంబ కలహాలతో అల్లుని హత్య..

16-10-2024 12:11 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో కలత చెంది మామ తన అల్లుని హత్య చేసిన ఘటన మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గత కొద్ది రోజులుగా మృతుడు గోమాస నరేందర్ (37), మామ గోలేటి శంకర్ మధ్య కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మామ గోలేటి శంకర్ గొడ్డలితో అల్లుడు గోమాస నరేందర్ నరికి హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.