27 July, 2026 | 12:29 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

ఫిఫా మ్యాగ్‌జైన్‌లో కేరళ ప్రొఫెసర్ పాటలు

07-06-2026 12:05 AM

కాలికట్, జూన్ 6: సాకర్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఫిఫా ప్రపంచకప్ మరో ఐదు రోజుల్లో మొదలుకానుంది. అమెరికా, మెక్సికో, కెనడా కలిసి ఆతిథ్య మిస్తున్న ఈ మెగా టోర్నీలో ఈ సారి 48 దేశాలు పాల్గొంటున్నాయి. దీంతో ఈ ఎడిషన్ అతిపెద్ద ప్రపంచకప్‌గా నిలవనుంది. ఇప్పటికే సాకర్ వరల్డ్‌కప్ ఫీవర్ ఊపేస్తోంది.

ఈ ఫీవర్‌కు కేరళ ప్రొఫెసర్ తాను స్వరపరిచిన పాటలతో మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు. కేరళకు చెందిన ప్రొఫెసర్ వశిష్ట్, ఆయన విద్యార్థులు ఫిఫా ప్రపంచకప్‌కు స్వాగతం చెబుతూ రాసిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పాటలు ఫిఫా మ్యాగ్‌జైన్‌లో సైతం ప్రచురించారు. అర్జెంటీనా దిగ్గజాలు డిగో మారడోనా, లైనోల్ మెస్సీపై రాసిన రెండు పాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. శాంతి కోసం ఫుట్‌బాల్ సందేశాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ పాటలు స్వరపరిచినట్టు ప్రొఫెసర్ వశిష్ట్ చెప్పారు.