ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు..
మందమర్రి (విజయక్రాంతి): ఎఐసిసి అగ్ర నాయకురాలు సోనియాగాంధీ 78వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోత్కు సుదర్శన్ లు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ప్రజలు పడుతున్న కష్టాలను ఇబ్బందులను గ్రహించి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారని గుర్తుచేశారు. 2004లో సోనియాగాంధీ కృషితోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఈ సందర్బంగా ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి సోనియా గాంధీ అని ఆమె సేవలను కొనియాడారు.
తెలంగాణలో 1400 మంది విద్యార్థుల ఆత్మబలిదానం చూసి చలించి ఒక ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ అని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు నెరువట్ల శ్రీనివాస్, గుడ్ల రమేష్, కనకం రాజు, మంకు రమేష్, ఎండి పాషా, సట్ల సంతోష్, ఏటూరి సత్యనారాయణ, జమాల్పూరి నర్సోజి, మహంత్ అర్జున్, ఎండి సుకూర్ లు పాల్గొన్నారు.
మండలంలో...
మండలంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు గందె రాంచందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత సోనియా గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. సోనియాగాంధీ హయంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కొమురయ్య, కమల మనోహర్, సీనియర్ నాయకులు రాయమల్లు మరాఠి శంకర్, మనోహర్, పున్నం మల్లేష్ లు పాల్గొన్నారు.






