29 April, 2026 | 1:34 PM

సోనియా గాంధీ వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది

09-12-2024 08:08 PM

రామగిరిలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రోడ్డ బాపన్న

రామగిరి (విజయక్రాంతి): సోనియా గాంధీ వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రోడ్డ బాపన్న అన్నారు. రామగిరి మండల కేంద్రములోని స్థానిక శ్రీపాద భవన్ ఆఫీసులో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పార్టీ అధ్యక్షులు బాప్పన్న, సీఎన్ సీ టౌన్ అధ్యక్షులు కాటం సత్యంల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆత్మ బలిదానాలను ఆపేందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత, తెలంగాణ తల్లి సోనియా గాంధీ అన్నారు. ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు  సోనియా గాంధీకి అవకాశం వచ్చిన కూడా అవకాశాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన గొప్ప నాయకురాలని, ఆమె సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించి, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్వామి గౌడ్, బండారి సదానందం, మైదం వరప్రసాద్, యూత్ నాయకులు శ్రీనివాస్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.