16 April, 2026 | 2:56 AM

హెల్మెట్ ధరించు.. క్షేమంగా ఇంటికి రా.. నాన్న

16-04-2026 01:24 AM

మంచిర్యాల, ఏప్రిల్ 15: ‘హెల్మెట్ ధరిం చు.. క్షేమంగా ఇంటికి రా...’ అంటూ నాన్నలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లో కేజీబీవీ పాఠశాల విద్యార్థినీలు భావోద్వేగ పోస్టుకార్డు లేఖలు ఆలోచింపజేస్తున్నాయి... రోడ్డు భద్రత,

ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్ - అలైవ్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం కోటపల్లి కేజీబీవీ పాఠశాలలో ఎస్‌ఐ రాజశేఖర్ విద్యార్థులకు రోడ్డు భద్రత, ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులతో వారి తల్లిదండ్రులకు పోస్టుకార్డుల మీద లేఖలు రాయించే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఆలోచించేలా పిల్లలు రాసిన లేఖలు జిల్లాలో వైరల్ అయ్యాయి.